కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ రెడ్డి!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఏ ఎమ్మెల్యే పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనటం సరికాదని అన్నారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయం అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ రెడ్డి!
New Update

BRS MLA Sudheer Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు తేల్చి చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ కోరారు.

ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పడిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తొందరపడి ఏమీ మాట్లాడొద్దు అని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. ఓటమిని హుందాగా స్వీకరిద్దాం అని అన్నారు.

కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి పరామర్శిస్తే.. తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయం అని వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్‌ సైనికుడిని.. బీఆర్ఎస్ లోనే ఉంటాను అని సుధీర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరు అని తేల్చి చెప్పారు.

ALSO READ: వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

#lb-nagar-mla-sudheer-reddy #congress #telugu-latest-news #brs-mla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe