కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. క్లారిటీ ఇచ్చిన సుధీర్ రెడ్డి!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఏ ఎమ్మెల్యే పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనటం సరికాదని అన్నారు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయం అని పేర్కొన్నారు.