MLA Raja Singh: ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ప్రధాని మోదీ(PM Modi) పర్యటించారు. దాదాపు ఆరున్నర వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి సాదరంగా ఆహ్వానం పలికారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్(Adilabad) బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ..ప్రధానమంత్రి అంటే తమకు పెద్దన్నలాంటివారని అన్నారు. గుజరాత్‌లా తెలంగాణ కూడా అభివృద్ధి చెందేందుకు మోదీ సహకరించాలని కోరారు.
Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!
అయితే, తాజాగా, ప్రధాని మోడీని రేవంత్ పొగడడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రధాని డబ్బులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంలోనే గత పదేళ్ళలో మోడీ రాష్ట్రానికి ఇచ్చిన డబ్బుల లెక్కను సీఎం రేవంత్ ప్రజలకు తెలియజేయాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని రిక్వెస్ట్ చేశారు.
Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీకి ఎంత ఫండ్ ఇచ్చింది అనేది చూసుకోవాలని వ్యాఖ్యానించారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు మొదట్లో కేసిఆర్ మోడీనీ పొగడ్తలతో ముంచెత్తారని.. ఆ తర్వాత కేసీఆర్ మారిపోయి.. మోడీ టూర్స్ లో ప్రోటోకాల్ కూడా పాటించలేదని గుర్తు చేశారు. కేసిఆర్ లా రేవంత్ సడెన్ గా మారొద్దని పేర్కొన్నారు.