Ananth Ambani Pre Wedding : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్లోని జామ్నగర్లో ఘనంగా జరిగింది. మూడురోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు జామ్నగర్ లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల అతిథుల లిస్ట్ లో మెటా సిఇఒ మార్క్ జుకర్బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సిఇఒ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సిఇఒ బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్లాక్రాక్ సిఇఒ లారీ ఫింక్, అడ్నాక్ సిఇఒ సుల్తాన్ అహ్మద్ ఉన్నారు. ఇక ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కరికే ఆహ్వానం వచ్చింది. దీంతో ఆయన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ నుంచి ఖాన్ త్రయం హాజరయ్యారు. వీరు ఈవెంట్ మొత్తం సందడి చేశారు.
పూర్తిగా చదవండి..Ananth Ambani Pre Wedding: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!
ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగాయి. అక్కడ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' పాట 'నాటు నాటు'కి డ్యాన్స్ చేశారు. ఆ డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: