Threatening Calls to BJP MLA Raja Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్‌కు ప్రాణ హాని ఉందా? ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? ఆ అగంతకులు రాజాసింగ్ ప్రతి అడుగును అబ్జర్వ్ చేస్తున్నారా? ఆయన పర్యటన షెడ్యూల్‌ను ముందే చెప్పేస్తున్నారా? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆయనను చంపే కుట్ర ఏమైనా చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్(MLA Raja Singh). తనను చంపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్. తనకు 15 డిజిట్ నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని, చంపుతాం, నరుకుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయని చెప్పారు రాజాసింగ్. తన గురించి, తన ప్రతి మూమెంట్ గురించి కాల్ చేసి చెప్తున్నారని ఆరోపించారు రాజాసింగ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తన నియోజకవర్గానికి వస్తున్నారని, ఆ సమయంలో తమ ఇద్దరినీ కలిసి చంపేస్తామని భయపెడుతున్నారని అన్నారు రాజాసింగ్. లేఖ మాత్రమే కాదు.. ఈ మేరకు ఒక వీడియో కూడా విడుదల చేశారు.
ఇదికూడా చదవండి: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..
తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ రాసిన లేఖ సారాంశం యధావిధంగా..
'నేను టి. రాజా సింగ్, గోషామహల్ ఎమ్మెల్యే. ఈరోజు, సుమారు మధ్యాహ్నం 1:59 గంటలకు, +619664800063233 నంబర్ నుండి నా వ్యక్తిగత నంబర్ 9000214000 కి కాల్ వచ్చింది. 6 నిమిషాలు మాట్లాడిన ఈ కాల్‌లో ఓ వ్యక్తి రాబోయే ఎన్నికల కౌంటింగ్ లోపు నాకు, నా కుటుంబానికి హాని కలిగించాలనే ఉద్దేశ్యంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. నన్ను చంపడానికి ప్లాన్ చేశానన్నారు. అంతేకాకుండా, త్వరలో జరగనున్న నా గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో నన్ను, ప్రచారానికి వస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి హాని కలిగిస్తామని కూడా బెదిరించారు.ఈ విషయంపై పోలీసులు శాఖాపరంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇప్పటికే నా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని, పాదయాత్రను ప్రారంభించాను. ఎన్నికల సంబంధిత ప్రయోజనాల కోసం గణనీయమైన సంఖ్యలో ప్రజలు నా కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు. నాకు గతంలో బెదిరింపు కాల్‌లు వచ్చినప్పటికీ, అధికారులు ఈ ప్రత్యేక ముప్పును పరిష్కరించడం అత్యవసరం. ప్రత్యేకించి యూపీ సీఎం యోగి ని లక్ష్యంగా చేసుకున్న ప్రస్తావన కారణంగా వెంటనే చర్యలు తీసుకోండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు డైరెక్టర్ జనరల్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తారని విశ్వసిస్తున్నాను.' అని లేఖలో పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్..