Raja Shingh: చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్ వస్తోందని, తన ప్రతీ అడుగు వారికి తెలిసిపోతుందని, తన ప్రోగ్రామ్స్ అన్నీ వారు ముందుగానే చెప్పేస్తున్నారు అంటూ ఫిర్యాదులో ఆరోపించారు రాజాసింగ్. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌తో పాటు.. రాష్ట్ర డీజీపీకి కూడా లేఖ రాశారు రాజాసింగ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/second-day-it-raids-in-hyderabad.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/MLA-Raja-Singh-1-jpg.webp)