/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MLA-Rachamallu-Sivaprasada-Reddy-strongly-reacted-incident-of-attack-on-CM-Jagan-jpg.webp)
MLA Rachamallu Sivaprasada Reddy: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా స్పందించారు. నిన్న జగన్‌పై జరిగిన దాడి ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని ఆయన ఆరోపించారు. కుట్రపూరితంగా తుదముట్టించాలని బలమైన రాయితో కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుబొమ్మకు అంగులంపైన ఉండే కణితకు ఆ రాయి తగిలి ఉంటే జగన్ మరణించేవాడని శివప్రసాదరెడ్డి అన్నారు.
ఈ దాడి కులపిచ్చితో, పదవి పిచ్చితో కమ్మవారు ఈ దాడి చేశారని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన దాడి జగన్‌పై కాదు, 5 కోట్ల ఆంధ్రులపై, పేద కుటుంబాల పెద్దకొడుకుపై అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను గెలవలేక మరణాన్ని కోరుకుంటున్నారు, ఇంతటితో జగన్‌పై దాడులు అగవు అన్నారు. ఏ క్షణమైనా ఆయన ప్రాణానికి ప్రమాదం కావొచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సిరియన్‌గా తీసుకొని.. చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాయితో దాడి చేయకుండా గన్‌తో కాల్చి ఉంటే ఏం జరిగేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రాణానికి భద్రత లేదు, గ్యారంటీ లేదన్నారు.జగన్‌కు ఎటువంటి ప్రమాదం జరుగకుండా ఉండాలని శివపార్వతులను వేడుకుంటున్నా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ఇది కూడా చదవండి: పిల్లలకు పదే పదే మసాజ్ చేస్తున్నారా?.. జాగ్రత్త