MLA Lasya Nanditha Postmortem Report: ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన యాక్సిడెంట్‌లో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాయి. ఇందులో సంచలన విషయాలు తెలిసాయి. తలకు బలమైన గాయాలు కావడం వల్లే ఆమె అక్కడికక్కడే చనిపోయారని పోస్ట్‌మార్టం నివేదికలో వైద్యులు రాశారు. సీటు బెల్ట్‌పెట్టుకోకపోవడం వల్లే లాస్య మృతి చెందింది అని.. తలకు బలమైన గాయాలయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు లాస్య థైబోన్, రిబ్స్ మొత్తం విరిగిపోయాయని...ఒక కాలు కూడా విరిగిపోయిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది. శరీరంలోని ఎముకలన్నీ నుజ్జునుజ్జు అయ్యాయని తెలిపారు. గాంధీ అసుపత్రిలో పోస్ట్‌మార్టం ముగిసిన తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
దర్గాలో పూజలు...
ఆరోగ్యం బాగుండాలని ఎమ్మెల్యే లాస్య నందిత నిన్న సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాలో పూజలు చేశారు. గాల మస్కిన్ బాబా దర్గాలో రాత్రి 1 గంట సమయంలో పూజలు నిర్వహించారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తెల్లవారుఝాము 3 గంటల వరకు అక్కడే గడిపిన లాస్య ఆ తరువాత హైదరాబాద్‌కు బయలు దేరారు. అయితే ఆమె వాహనం పటాన్ చురె వైపుకు ఎందుకు వెళ్ళింది..ఆమెతో పాటూ మిగతా కుటుంబసభ్యులు ఎందుకు లేరనే విషయాల మీద మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కారు ప్రమాదానికి గురైన చోటును సంగారెడ్డి ఏఎస్పీ సంజీవరావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ప్రమాదం పై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.
Also Read:National: సరోగసీ నిబంధనల్లో మార్పులు..దాతల నుంచి కూడా వీర్యం, అండాలు