AP: పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకు? జగన్‌పై ఎమ్మెల్యే ఫైర్..! పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీకి రాని జగన్‌కు రాష్ట్రంలో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అంతు చిక్కడం లేదని .. నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేసి పని పడతామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి MLA Kuna Ravi Kumar : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకో ? అని మాజీ సీఎం జగన్ పై (YS Jagan) తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాని జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అంతు చిక్కడం లేదని.. ప్రొక్లేనర్లు పెట్టి అవినీతి మూలలను వెలికి తీస్తున్నామన్నారు. Also Read: బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ.. ఆనాటి బొబ్బిలి రాజుల కాలంలో.. జగన్‌కు రాజ్యాంగంపై కనీస అవగాహన లేదని..జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు. అధికారం కోసం జగన్ జోకర్ వేషాలు వేశాడని.. ఆయన వేషాలను ప్రజలు పసిగట్టారన్నారు. మరో నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేస్తామన్నారు ఎమ్మెల్యే కూన రవి కూమార్. ఐదేళ్ల అవినీతిని అరవై రోజుల్లో నిరూపించలంటే సాధ్యం కాదని.. నిలకడగా ఉండి పక్కా ఆధారాలతో జగన్ పని పడతామన్నారు. #ap-news #srikakulam #kuna-ravi-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి