MLA KTR: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్‌. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని అన్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌‌ను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.

New Update
MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

MLA KTR: ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) లేఖ రాశారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). ఎల్ఆర్ఎస్ ను (LRS) ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో మీతో సహా, మీ సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు… ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ ను మా నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎంను కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హామీలు మాట్లాడిన మాటలను తన లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

ALSO READ: తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

LRS పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

2020 ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది.

నగర, పురపాలికలు, పంచాయతీ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు.. గత ప్రభుత్వం 2020లో దరఖాస్తులకు ఆహ్వానించింది. దీనికి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టుల్లో పలువురు పిటీషన్లు వేయడంతో క్రమబద్దీకరణ చేపట్టే ప్రక్రియ ఆగిపోయింది. అయితే రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగులపై ఉన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమ సహకారం ఉంటుందని ఆయన గతంలోనే భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisment
తాజా కథనాలు