MLA KTR: కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

TG: లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు.

New Update
MLA KTR:  రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది..  రేవంత్ సర్కార్‌పై  కేటీఆర్ ఫైర్

MLA KTR Over EC Ban On KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్నికల ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల నిషేధాన్ని విధించడంపై స్పందించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన ఎన్నికల సంఘం (Election Commission) ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కార్యాచరణ ఉంద‌ని ఫైర్ అయ్యారు.

ALSO READ: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. సీఈవో కీలక ప్రకటన

లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ముందు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ తీసేలా ఈసీ చర్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ (PM Modi), అమిత్ షా దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు. 20 వేలకు పైగా ఫిర్యాదులు చేసినా ఈసీ నోటీసు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడిన కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.


అసలేమైంది..

మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్లలో కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా “అవమానకరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు” చేసినందుకు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ పై ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వగా..  ఆయన స్పందించక పోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisment
తాజా కథనాలు