Harish Rao : 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదు..!!

Harish Rao : 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదు..!!
New Update

Harish Rao :  మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భద్రాచలం జిల్లా పినపాక నియోజకవర్గంలో పర్యటించారు.పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. రెండులక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడవకుముందే ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కరెంట్ కోతలు వచ్చాయి.. రైతు బంధు పడటం లేదు.. పింఛన్లు రావడం లేదు... ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడి... 12 మంది సోదరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆటో కార్మికులకు నెలకు 10 వేలు అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొట్టండి అంటడు ఒక మంత్రి..ఫిబ్రవరి వరకు ఏనాడైనా రైతు బంధు పడకుండా ఉందా అని ప్రశ్నించారు. కరోనా వచ్చినప్పుడు ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి రైతులకు రైతు బంధు ఇచ్చిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.

publive-image

ఇది కూడా చదవండి: మీరు చికెన్ తినాలో?మటన్ తినాలో? మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..!!

2 నెలల్లో 14 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు.ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి... తెలంగాణకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. మంజూరు చేసిన పనులు కొనసాగించాల్సింది పోయి రద్దు చేయడం బాధాకరమన్నారు.ఇదే విషయంపై ఎక్కడికక్కడ ఫ్లెక్సీ కట్టి.. వాస్తవాలు వెల్లడించాలని ప్రజలకు వెల్లడించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ అని పత్రికల్లో యాడ్ ఇచ్చి మోసం చేసింది ఎవరని ప్రశ్నించారు. ఫిబ్రవరి 1 వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు.

publive-image

రుణమాఫీ చేస్తాం అని మోసం చేశారు.పోలీసు స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. నిరుద్యోగ భృతి మేము చెప్పలేదని భట్టి అబద్ధం చెబుతున్నారన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు మేమే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించాం..దీన్ని కూడా మేమే ఇచ్చాం అంటున్నారు. స్టాఫ్ నర్స్, పోలీసు ఉద్యోగాలు మేము ఇచ్చినవే.అది మీ ఘనత కాదు. 2 లక్షల ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే ఇచ్చేదాక ఊరుకునేది లేదని హరీశ్ రావు హెచ్చరించారు.

#pinapaka #bhadrachalam #mla-harish-rao #harish-rao #congress
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe