అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితో అసెంబ్లీ పనితీరుపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణననపై ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. అయినా సభలో తీర్మానం చేస్తున్నారని అన్నారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తీర్మానం చేయాలని అన్నారు. మేము కుల గణన తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని.. కానీ న్యాయమైన అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు.
Also read: కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం
మమ్మల్ని బీజేపీ బీ-టీమ్ అంటున్నారు
'స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లీంలు ఇందిరా గాంధి నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టీడీపీ పార్టీలకు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం పోరాడితే నాయకులు అంటున్నారు. కానీ మేము మా మైనార్టీల కోసం కోట్లాడితే మాత్రం మమ్మల్ని బీజేపీ బీ-టీమ్ అంటున్నారని' అక్బరుద్దీన్ అన్నారు.
అందుకే వాళ్లకు బాధ
ఇదిలాఉండగా.. అసెంబ్లీలో కులగణన బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ఉద్దేశమని.. తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటంబ సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదంటూ ప్రశ్నించారు. కులగణనను అమలు చేసే విషయంపై న్యాయ, చట్టపరంగా ఏమైన చిక్కులు ఉన్నట్లు అనుమానం ఉంటే సూచనలు ఇవ్వాలని.. తీర్మానానికే చట్టబద్ధత లేదని మాట్లాడటం సరైంది కాదని విపక్ష పార్టీలకు హితువు పలికారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న జనాభా లెక్కలు బయటికి వస్తే.. వాళ్లకి రాజ్యాధికారంలో ఎక్కడ భాగమివ్వాల్సి వస్తుందోననే బాధ కొంతమందికి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైన ప్రధాన ప్రతిపక్ష నేత (కేసీఆర్) సభకు రావాలంటూ పేర్కొన్నారు.
Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు