MLA Adhi Narayana Reddy : అసెంబ్లీ (Assembly) లాబీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చిట్‌చాట్ చేశారు. ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ (YCP) వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. మమ్మల్ని ఆడుకున్నారు కదా.. మరి మేము ఆడుకోవద్దా అని ఆదినారాయణ సెటైర్లు వేశారు. ఓ రాయలసీమ పెద్ద మనిషి తన దగ్గరకు వచ్చి.. జగన్ ను తప్ప మిగిలిన ఎమ్మెల్యేలను మొత్తం తీసుకొస్తానని బీజేపీ (BJP) లో చేర్చుకోండి అని వేడుకున్నాడన్నారు.
అయితే, తాను కుదరదు అని తేల్చి చెప్పినట్లు ఆదినారాయణ వెల్లడించారు. వైసీపీ వాళ్లను చేర్చుకుంటే వాళ్ల తప్పులకు తాము బాధ్యులం అవుతామని అందుకే తమ పార్టీలోకి వొద్దని వాళ్ల చేరికకు నో చెప్పానన్నారు. పెద్దిరెడ్డి ఇప్పడు చిన్నరెడ్డి అయిపోయాడని ఆదినారాయణ చురకలు వేశారు. అవినాష్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. బీజేపీతో పొత్తుకు తాను, విష్ణుకుమార్ రాజే కారణమని ఆదినారాయణ స్పష్టం చేశారు.
Also Read : బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే!