BSNL: బీఎస్ఎన్ఎల్ తోడుగా టాటాతో పాటు ప్రభుత్వం.. జియో-ఎయిర్టెల్ లకు దబిడి.. దిబిడే! జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు పెంచడంతో యూజర్స్ బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బడ్జెట్ లో రూ.80 వేల కోట్లకు పైగా కేటాయించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 1500 కోట్ల రూపాయల విలువైన డీల్ కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ దూసుకుపోయే ఛాన్స్ ఉంది By KVD Varma 24 Jul 2024 in Uncategorized New Update షేర్ చేయండి BSNL: ఒక్కసారిగా టారిఫ్ పెంచేసిన జియో..ఎయిర్టెల్ టెలికాం కంపెనీలపై యూజర్స్ గుర్రుగా ఉన్నారు. ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడ్డారు. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ దాని 4జీ నెట్వర్క్ ఇప్పటికీ సరిగా లేదు. దీంతో తప్పనిసరై టారిఫ్ లు ఎక్కువైనా పాత వాటిలోనే కొనసాగుతున్నారు. అయినా.. బాయ్ కాట్ జియో పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ కూడా జరుగుతోంది. చాలామంది బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ కూడా అయ్యారు. ఇది కష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ కి వరంగా మారిందని చెప్పవచ్చు. ఈలోపు మరో కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. టాటా గ్రూప్ నాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ బీఎస్ఎన్ఎల్ తో కలుస్తోందని వార్తలు వచ్చాయి. అది పూర్తిగా నిజం కాకపోయినా.. బీఎస్ఎన్ఎల్ మరో లెవెల్ కి వెళ్ళడానికి టీసీఎస్ సహాయం చేయబోతోంది. BSNL: టీసీఎస్ 1500 కోట్ల రూపాయల డీల్ బీఎస్ఎన్ఎల్ తో కుదుర్చుకుంది. దీని ప్రకారం భారతదేశంలోని 1,000 గ్రామాల్లో 4G సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా చేయడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని, తద్వారా డిజిటల్ విభజనను తగ్గించి, జియో- ఎయిర్టెల్లకు పోటీ ప్రత్యామ్నాయాన్ని అందించాలని వారు భావిస్తున్నారు. BSNL: ప్రస్తుతం, 4G ఇంటర్నెట్ మార్కెట్లో Jio - Airtel ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, BSNL ఈ భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే, ఈ గుత్తాధిపత్యాన్ని ముగించే అవకాశం ఉంది. పోటీ ధరలను.. మెరుగైన సేవలను అందించడం ద్వారా, జియో - ఎయిర్టెల్ ఇటీవలి ధరల పెంపుపై అసంతృప్తితో ఉన్న వినియోగదారుల సంఖ్యను BSNL ఆకర్షించగలదు. సహజంగానే దేశవ్యాప్తంగా విస్తృతమైన 2జీ నెట్వర్క్ ఉన్న బీఎస్ఎన్ఎల్ తో వ్యాపారరంగంలో నాణ్యమైన సేవలు అందించే సంస్థగా పేరున్న టాటా చేతులు కలపడంతో భవిష్యత్ లో మొబైల్ నెట్వర్క్ లో ఆధిపత్యం చెలాయిస్తున్న జియో..ఎయిర్టెల్ లకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ప్రభుత్వ సహకారమూ ఉంది.. ఈ ఏడాది అంటే 2024-25 బడ్జెట్ లో BSNLలో మూలధన ఇన్ఫ్యూషన్ను ₹82,916 కోట్లకు కేంద్రం పెంచింది. 2023-24 కాలంలో మూలధన ఇన్ఫ్యూషన్ ₹52,937 కోట్లుగ ఉంది. అంటే దాదాపు 30 వేల కోట్ల రూపాయలు పెరిగింది. ఈ మొత్తం 82,916 కోట్ల మూలధన వ్యయంలో ఎక్కువ భాగం 4G మరియు 5G స్పెక్ట్రమ్ కేటాయింపు రూపంలో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ఇప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేసినట్టే. జియో..ఎయిర్టెల్ టారిఫ్ లు ఎంత పెరిగాయంటే.. BSNL: ఇటీవల జియో - ఎయిర్టెల్ తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచాయి, దీని కారణంగా వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. జియో ధరలు 12 నుండి 25 శాతం పెరిగాయి, ఎయిర్టెల్ ధరలు 11 నుండి 21 శాతం పెరిగాయి. ఇక వొడాఫోన్ ఐడియా (Vi) కూడా 10 నుండి 21 శాతం టారిఫ్ లను పెంచింది. జూలై ప్రారంభం నుండి ఈ టారిఫ్ లు అమలులోకి వచ్చాయి. ఈ టారిఫ్ ల ప్రకటనల తరువాత యూజర్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. చాలామంది చౌకైన ప్లాన్స్ అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ వైపు పోర్ట్ కావడం మొదలు పెట్టారు. #bsnl #airtel #tcs #jio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి