Mithun Chakraborty : బాలీవుడ్ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స

80, 90ల్లో బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన మాస్ హీరో మిథున్ చక్రవర్తి అనారోగ్యం పాలయ్యారు. గుండెనొప్పితో ఆయన ఈరోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మిథున్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Mithun Chakraborty : బాలీవుడ్ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స

Bolly Wood Retro Actor : అయామ్ ఏ డిస్కో డాన్సర్(I Am A Disco Dancer)... ఈపాట తెలియని బారతీయుడు(Indian) ఉండరు. 80ల్లో వచ్చిన ఈ పాట ఇప్పటికీ అందరి చేత డాన్సులు చేయిస్తూనే ఉంది. ఇక పాటలో నటించిన హీరో మిథున్ చక్రవర్తి గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. రెట్రో టైమ్‌(Retro Time) లో మాస్ హీరోగా ఫేమస్ అయిన మిథున్ చక్రవర్తి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ఈయన సడెన్‌గా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం గుండెనొప్పి వస్తోందని చెప్పడంతో మిథున్‌ను కుటంబ సబ్యలు ఆసపత్రికి తరలించారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Also Read : USA : అమెరికాలో మరో భారతీయుడు మృతి…వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త

80, 90ల్లో హవా...

బాలీవుడ్‌(Bollywood) లో 80, 90 దశకాల్లో ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేశారు మిథున్ చక్రవర్తి(Mithun Chakraborty). బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్, బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో హీరోగా చేశారు. ఇప్పటి వరకూ ఆయన 100కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన చివరి సినిమా బెంగాలీలో వచ్చిన కాబూలీవాలా. ఇదే కాకుండా పలు టీవీ షోల్లో జడ్జిగా కూడా వ్యవహరించారు మిథున్. మిథున్, శ్రీదేవిల జంట బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద టాప్ పెయిర్. ఇక తెలుగు సినిమా గోపాలా గోపాలాలో కూడా మిథున్ నటించారు.

బీజేపీలో సభ్యుడిగా..

బాలీవుడ్‌లోనే కాదు మిథున్ చక్రవర్తి రాజకీయాల్లో సేవ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కొన్నాళ్ళు ఉన్నారు. మొదట టీఎంసీ సభ్యుడిగా ఉన్నారు. తరువాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ(BJP) లో చేరారు. ఈ ఏడాది మిథున్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు(Padma Bhushan Award) ను కూడా ప్రకటించింది. మిథున్ చక్రవర్తికి రెండేళ్ళ క్రితం బెంగళూరులో కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఛాతి నొప్పితో ఈయన కోలకత్తాఅలోనా అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు.

Also Read : ఆరు గ్యారెంటీలే హైలైట్.. సమానత్వమే లక్ష్యంగా.. తెలంగాణ మధ్యంతర బడ్జెట్!

Advertisment
తాజా కథనాలు