Train: రైలు బోర్డుపై తప్పుడు అనువాదం.. సెటైర్లు వేస్తున్న నెటీజన్లు ఓ రైలు బోర్టుపై హటియా - ఎర్నాకులం అని హిందీ, ఇంగ్లీష్‌లో ఉంది. హటియాను మళయంలో అనువాదం చేసి కొలపతకం అని రాశారు. దీని అర్థం హత్య (మర్డర్). ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది మర్డర్ ఎక్స్‌ప్రెస్ అని నెటీజన్లు సెటైర్లు వేస్తున్నారు. By B Aravind 13 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి చాలామంది అనువాదం కోసం గూగుల్ ట్రాన్స్‌లేషన్ యాప్‌ను వాడుతుంటారు. అయితే ఓ రైలు బోర్టును తప్పుగా అనువాదం చేయడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ రైలు బోర్డుపై హటియా - ఎర్నాకులం అని హిందీ ఇంగ్లీష్‌లో ఉంది. అయితే హటియాను మళయంలో అనువాదం చేసి కొలపతకం అని బోర్డుపై రాశారు. వాస్తవానికి దీని అర్థం హత్య (మర్డర్). ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటీజన్లు ఈ రైలు పేరు మర్టర్ ఎక్స్‌ప్రెస్‌గా మారిపోయిందంటూ సైటైర్లు వేస్తున్నారు. Also Read: ఇరాన్ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే అలాగే దీనిపై నిర్లక్ష్యం వహించిన రైల్వే అధికారులపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ అధికారి స్పందించారు. ఆ పేరును తప్పుడు అనువాదం చేశారని.. తమ దృష్టికి వచ్చిన వెంటనే నేమ్‌ప్లేట్‌ను మార్చేశామని చెప్పారు. అయితే రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 Also Read: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు #telugu-news #national-news #indian-railways మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి