Miss Shetty Mr Polishetty Movie Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ

లాంగ్ గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి, అనుష్క చేసిన కామన్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేష్ బాబు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. మరి ఈ సినిమా శెట్టి కాంబోకు సక్సెస్ అందించిందా..?

New Update
Miss Shetty Mr Polishetty Movie Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రివ్యూ

Miss Shetty Mr Polishetty Movie Review

కథ
కథ విషయానికి వస్తే... ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు అన్విత. అన్విత చెఫ్. ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. అదే సమయంలో వివాహానికి కూడా వ్యతిరేకం. పెళ్లి అయితే చేసుకోదు కానీ ఒక బిడ్డకు తల్లి కావాలని మాత్రం అనుకుంటుంది. ఇదే సమయంలో అనుష్క స్టాండప్ కమెడీయన్ అయినటువంటి నవీన్ పొలిశెట్టి పరిచయం అవుతాడు. అనుష్కకు బాగా నచ్చుతాడు కూడా. కానీ పెళ్లి వద్దు.. కేవలం తన నుంచి బిడ్డ మాత్రమే కావాలని అంటుంది. మరి ఇలాంటి సమయంలో నవీన్ ఏం చేశాడు. అనుష్క బిడ్డకు జన్మనిచ్చిందా లేదా అన్నదే క్లైమాక్స్.

నటీనటుల పనితీరు
ఇక యాక్టింగ్ విషయానికి వస్తే... యాక్టింగ్ లో ఇద్దరూ ఇద్దరే. కానీ ఎందుకే నవీన్ ఉన్నంత సేపు సినిమా చాలా సరదాగా ఉంటుంది. అనుష్క (Anushka) ఉన్నంతేసేపు ఏదో ఉంది అన్నట్లు ఉంటుంది. అనుష్క బొద్దుగా ఉన్నా చూడ్డానికి బావుంది. అయితే అనుష్క సినిమాలకు పనికిరాదు అనే విషయం మాత్రం స్క్రీన్ పై స్పష్టంగా తెలిసిపోతుంది. నవీన్ (Naveen Polishetty) మాత్రం వన్ మ్యాన్ షో చేశాడు. అతడి కామెడీ టైమింగ్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రాబోయే రోజుల్లో ఇలాంటి కామెడీ పాత్రలు చేసుకుంటూ పోతే కామెడీకి కేరాఫ్ అవుతాడు నవీన్. కానీ నవీన్ పరిపూర్ణ నటుడు. అతనికి మంచి పాత్రలు ఇస్తే చెలరేగిపోతాడు. సినిమా మొత్తం వీళ్లిద్దరి పాత్రల చుట్టూనే తిరుగుతుండడం వల్ల ఇతర పాత్రల ప్రభావం పెద్దగా కనిపించదు. అయినప్పటికీ ఉన్నంతలో అభినవ్ గోమటం, తులసి, మురళీ శర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also Read: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..

Miss Shetty Mr. Polishetty Movie Review

పాజిటివ్ అంశాలు
జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ తర్వాత నవీన్ పొలిశెట్టికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా రెండేళ్లు వెయిట్ చేసి మరీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేశాడు. చాలా రోజుల తర్వాత అనుష్క కూడా ఒక సినిమా చేయడంతో.. అసలు మూవీ ఎలా ఉంటుందా.. నవీన్, అనుష్క మధ్య కెమిస్ట్రీ ఏంటి అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువైంది. భారీ అంచనాలు అయితే లేవు కానీ ఓ మాదిరి అంచనాలతో.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ అంచనాలే ఈ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చిపెట్టింది. ఇదొక పాజిటివ్ ఎలిమెంట్ కాగా.. నవీన్-అనుష్క పెర్ ఫార్మెన్స్ అదిరింది. ఇక సినిమాలో కామెడీ బ్రహ్మాండంగా పేలింది. థియేటర్లలో నవ్వులు పండాయి. సినిమాలో కోర్ కాన్సెప్ట్ బాగుంది. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. పెళ్లి వద్దు సహజీవనం ముద్దు అనే హీరోల్ని తెరపై చూశాం కానీ, పెళ్లి వద్దు పిల్లలు మాత్రం కావాలనే హీరోయిన్ ను మాత్రం తెలుగుతెరపై తొలిసారి చూస్తున్నాం. ఇదొక కొత్త పాయింట్ అయింది. సినిమాటోగ్రఫీ మరో హైలెట్ పాయింట్.

Miss Shetty Mr. Polishetty Movie Review

నెగెటివ్ అంశాలు
సినిమాలో ఎన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, అన్ని నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవ్వడమే స్లోగా మొదలవుతుంది. మొదటి 20 నిమిషాలు ఏంటీ సినిమా అనిపిస్తుంది. నవీన్ వచ్చిన తర్వాత కూడా చాలాసేపటి వరకు వినోదం మొదలవ్వదు. ప్రేక్షకుడి కోణంలో చూస్తే, 20 నిమిషాల రన్ టైమ్ వృధా అనిపిస్తుంది. దీనికితోడు మ్యూజిక్ ఒకటి. పాటలు ఆల్రెడీ ఫెయిల్ అనే విషయం తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వీక్ అయింది. మరో ప్రధానమైన నెగెటివ్ పాయింట్, అందరూ అనుమానం వ్యక్తం చేసిన పాయింట్ లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ. బొద్దుగా ఉండే అనుష్క, స్లిమ్ గా ఉండే నవీన్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే అనుమానం చాలామందిలో ఉంది. ఆ అనుమానమే నిజమైంది. లీడ్ పెయిర్ కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. దీనికితోడు రైటింగ్ లో కూడా సమస్యలున్నాయి. కొత్త కుర్రాడు మహేష్, కొన్ని సన్నివేశాలు డీల్ చేయలేకపోయాడు.

Miss Shetty Mr. Polishetty Movie Review

ఫైనల్ స్టేట్ మెంట్
ఇలాంటి నెగెటివ్ అంశాలున్నప్పటికీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ బోల్డ్ గా అనిపించినప్పటికీ, కామెడీతో ఈ సినిమా గట్టెక్కిపోతుంది. మొదటి 20 నిమిషాలు పక్కనపెడితే, మిగతా టైమ్ అంతా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.

న‌టీన‌టులు - న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి తదితరులు
➼ బ్యాన‌ర్‌ - యువీ క్రియేష‌న్స్‌
➼ నిర్మాత‌లు - వంశీ, ప్ర‌మోద్‌
➼ ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం - మ‌హేష్ బాబు.పి
➼ సంగీతం - రధన్
➼ ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
➼ సినిమాటోగ్రఫీ - నిర‌వ్ షా
➼ కొరియోగ్రఫీ - రాజు సుంద‌రం, బృందా
➼ రన్ టైమ్ - 2 గంటల 31 నిమిషాలు
➼ రేటింగ్ - 2.75/5

Also Read: భారత చలనచిత్ర చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ భానుమతి

Advertisment
Advertisment
తాజా కథనాలు