Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో 'మీర్జాపూర్ సీజన్ 3', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ లవర్స్ కు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది.. ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న క్రైం,యాక్షన్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్ సీజన్ 3' స్ట్రీమింగ్ డేట్ ను తాజా ప్రకటించింది. జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ప్రసారం కానున్నట్లు తెలిపింది.

New Update
Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో 'మీర్జాపూర్ సీజన్ 3', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mirzapur Season 3 Streaming Date Out :  అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ నుంచి త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. అమెజాన్లో ఎన్ని సిరీస్ లు వచ్చిన 'మీర్జాపూర్' కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు.

2018లో 'మీర్జాపూర్' మొదటి సీజన్ అమెజాన్ లో విడుదలై రికార్డ్ స్థాయిలో న్యూస్ సాధించి సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ బ్లాక్ బస్టర్ అవడంతో 2020 లో రెండో సీజన్ ని రిలీజ్ చేశారు. అది కూడా మొదటి సీజన్ ను మించి రెస్పాన్స్ అందుకుంది. ఇక చాలాకాలంగా సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా సీజన్ 3 స్ట్రీమింగ్‌ డేట్ ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది.

Also Read : మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. సరికొత్త పోస్టర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ స్పెషల్ విషెస్!

జూలై  5 నుంచి... 

జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ప్రసారం కానున్నట్లు తెలిపింది.క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లకు గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు.తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్‌లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. ఈ సీజన్ లో విజయ్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇతనితో పాటూ మరికొందరు యాక్టర్స్ ఈ సీజన్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.


Advertisment
తాజా కథనాలు