Asafoetida Water : ఇంగువ నీళ్లు తాగితే మన శరీరంలో జరిగే అద్భుతాలు

ఇంగువ నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మన రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌ చేస్తాయి. మధుమేహం ఉన్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని ఇంగువ తగ్గిస్తుంది.

New Update
Asafoetida Water : ఇంగువ నీళ్లు తాగితే మన శరీరంలో జరిగే అద్భుతాలు

Asafoetida Water Benefits : ఇంగువ(Asafoetida) నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మన రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కూడా కంట్రోల్‌ చేస్తాయి. ఇంగువ అనేది భారతీయ వంటకాలలో ఉపయోగించే మసాలా. దీనిని ప్రజలు రుచి కోసం ఎక్కువగా వాడుతుంటారు. సాంబార్‌లో ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరు. అనేక పోషకాలు ఉన్న ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఆహారంలో భాగంగా తీసుకోవడమే కాకుండా ఇంగువ నీళ్లు తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో చాలా సుగంధ ద్రవ్యాలను వాడుతుంటాం. వాటిలో ఇంగువ కూడా ఒకటి.

బరువు తగ్గడానికి

  • ఇంగువలో ఆకలిని తగ్గించే గుణాలు(Reducing Hunger) ఉన్నాయి. ఆహారం తీసుకునే ముందు ఇంగువ నీళ్లు తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. క్యాలరీలను వేగంగా కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

  • ఇంగువ సాధారణంగా జీర్ణక్రియ(Digestion) కు బాగా పనిచేస్తుంది. ఇంగువ నీరు వాపు, గ్యాస్ మరియు అజీర్ణాన్ని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌

  • ఇంగువ రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇంగువ ఒక వరం అని చెప్పవచ్చు.

లిపిడ్ ప్రొఫైల్‌ మెరుగుపడుతుంది

  • శరీరంలో కొలెస్ట్రాల్(Fat) మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో ఇంగువ బాగా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నవారికి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇంగువ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

శ్వాసకోశ ఇబ్బందులకు :

  • ఇంగువ నీటిని తాగితే శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందుల నుంచి ఉపశసమం లభిస్తుంది. అంతేకాకుండా.. శ్వాస ఆడకపోవడం, దగ్గు లాంటి వాటి లక్షణాలు ఉంటే తగ్గుతాయి.

ఈ విషయంలో జాగ్రత్త:

  • ప్రతిరోజూ పరగడుపున ఇంగువ నీటిని తాగవచ్చు. అయితే.. నీటిలో ఇంగువను ఎంత వేసుకుంటున్నారు..? అనే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చిటికెడు ఇంగువ మాత్రమే వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధమైన చికాకులు వస్తాయి.

ఇది కూడా చదవండి: కంప్యూటర్‌ డెస్క్ ముందు అదే పనిగా వర్క్ చేస్తున్నారా? ఫిట్‌గా ఉండటానికి ఇలా చేయండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఎర్ర ముల్లంగితో అధిక బరువుకు చెక్‌..ఇంకా ఎన్నో ప్రయోజనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు