Roja: హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు.. మంత్రి రోజా సెటైర్లు

టీడీపీ- జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని అన్నారు మంత్రి రోజా. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు వచ్చి భోగి వేస్తున్నారు.. భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతారని అన్నారు.

New Update
Roja: హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్ నేతలు.. మంత్రి రోజా సెటైర్లు

Minister Roja : తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు(Sankranti Wishes) తెలిపారు మంత్రి రోజా(Roja). తెలుగు ప్రలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండలని అన్నారు. అనంతరం టీడీపీ(TDP), జనసేన(Janasena) పై విమర్శల దాడికి దిగారు. ఇద్దరు నాన్ లోకల్ నేతలు హైదరాబాద్(Hyderabad) నుంచి సంక్రాంతి వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక చంద్రబాబు(Chandrababu) జనసేనతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. టీడీపీ- జనసేన మేనిఫెస్టోను ప్రజలు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని విమర్శించారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఇద్దరు నాన్ లోకల్(Non-Local) నేతలు వచ్చి భోగి వేస్తున్నారని చురకలు అంటించారు. భోగి, ఎన్నికలు అయిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వెళ్లిపోతారని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తరిమేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి రోజా.

Also Read : Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్!

జగన్ జిల్లాల పర్యటన…

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో విజయడంక మోగించేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన మొదలు పెట్టాయి. సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగుతున్నాయి. జిల్లాల పర్యటనలు, సభలు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే.. ప్రతిపక్షాలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాలను తిప్పి కొట్టేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.

నాలుగో లిస్ట్.. అప్పుడే?

వైనాట్ 175 దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ(YCP) ఇప్పటికే ఇంఛార్జులను నియమిస్తూ మూడు లిస్టులను విడుదల చేసింది. సుమారు 60 మంది అభ్యర్థులను మార్చింది. ఇటీవల విడుదల చేసిన మూడో లిస్టులో ఆరు ఎంపీ స్థానాల ఇంఛార్జిలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాలుగో లిస్ట్ ఎప్పుడు విడుదల అవుతుందనే ఉత్కంఠ వైసీపీ ఎమ్మెల్యేలలో నెలకొంది. నాలుగో లిస్టులోనైనా తమ పేరు ఉంటుందో లేదో అనే టెన్షన్ వారిలో నెలకొంది. అయితే.. నాలుగో లిస్టుపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం సంక్రాంతి తరువాతే ఈ లిస్టును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటన చేపట్టనుండడంతో దీనికి ముందుగానే ఈ నాలుగో లిస్ట్ విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు