Lovers Suicide In Tirupati: అడవిలో మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య!

తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.జిల్లాకు చెందిన రామ సముద్రం మండలం చిట్టెంవారి పల్లికి చెందిన కల్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు(కొత్తిండ్లు) గ్రామానికి చెందిన యుగంధర్‌ (17) ఇద్దరు కలిసి పుంగనూరులో ఓ కాలేజీలో ఇంటర్‌ సెంకడియర్‌ చదువుతున్నారు.

New Update
suicide  Eturunagaram

Lovers Suicide In Tirupati: తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాకు చెందిన రామ సముద్రం మండలం చిట్టెంవారి పల్లికి చెందిన కల్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు(కొత్తిండ్లు) గ్రామానికి చెందిన యుగంధర్‌ (17) ఇద్దరు కలిసి పుంగనూరులో ఓ కాలేజీలో ఇంటర్‌ సెంకడియర్‌ చదువుతున్నారు.

వీరు చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం గురించి ఇంట్లో వారికి తెలియజేసి వివాహం చేయమని అడిగారు. కానీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోగా..వారిని కట్టుదిట్టం చేశారు. దీంతో ఇద్దరు కలిసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్న విధంగానే వారు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయిన ఇద్దరు..ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఏమి అనుకున్నారో ఏమో..భాకరాపేట ఫారెస్ట్‌ లోకి వెళ్లి ఇద్దరు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ (Bhakrapet Forest) చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్థానికులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి చూడగా మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు.

ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతుండడంతో ఈ నెల 18న ఇంటి నుండి పరార్ అయినట్లు ఎర్రవారి పాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. దీనిపై మరింత విచారణ చేపడుతున్నట్లు చెప్పారు.

Also Read: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు