Telangana: సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఆ పని చేయాలని విజ్ఞప్తి

జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు.

New Update
Telangana: సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఆ పని చేయాలని విజ్ఞప్తి

Thummala Nageswara Rao: జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ (Revanth Reddy), చంద్రబాబు (Chandrababu Naidu) భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయితీలను భద్రాచలంలో (Bhadrachalam) కలపాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలుస్తామంటూ తీర్మానాలు చేశాయని.. ప్రజల అభిప్రాయం దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Also read: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు

రాష్ట్ర విభజన (Bifurcation) సమయంలో ఏపీలో ఏడు మండలాలు వీలినం అయ్యాయని.. భద్రచలం పట్టణ శివారు ఏపీలో విలీనం కావడంతో డంపింగ్ యార్డు సమస్యలు మొదలయ్యాని తెలిపారు. చర్ల వెళ్లే ప్రధాన రహదారిలో గ్రామాలు ఆంధ్రాలో కలపడం వల్ల అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు, సాంకేతిక సమస్యలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. భద్రాచలం దేవాలయం భూములు పురుషోత్తమపట్నంలో ఉండడంతో పర్యవేక్షణకు కరవు ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.

Also Read: ఎల్లుండే తెలుగు సీఎంల భేటీ.. ఈ పది సమస్యలపైనే ప్రధాన చర్చ?

Advertisment
తాజా కథనాలు