Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన

TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.

New Update
Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన

Thummala Nageswara Rao: మూడో దఫా రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో రుణమాఫీ (Rythu Runa Mafi) సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని అన్నారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.

సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని తీపి కబురు అందించారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అర్హులకు రైతు రుణమాఫీ చేసి జరుగుతుందని.. ఎవరు ఆందోళన పడాల్సినఅవసరం లేదని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.

Also Read: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా - హరీష్ శంకర్

Advertisment
తాజా కథనాలు