Telangana :సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

తెలంగాణలో పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు.తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు.

Telangana :సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో  మంత్రి శ్రీధర్ బాబు భేటీ
New Update

Telangana :తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తరువాత మంత్రులంతా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ  అభివృధ్ధి కోసం కృషి చేస్తున్నారు. మొన్న లండన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయంలో తెలంగాణా ప్రాంతానికి తిరుగులేదని మన రైతు గొప్పతనం హురించి అక్కడ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే పెట్టబడులు సాధనలో భాగంగా సౌదీ అరెబియాలో జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరుస భేటీల్లో పాల్గొన్నారు.

పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం నాడు జెడ్డాలో పలు సంస్థల ప్రతినిధులతో రాత్రి వరకు వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనువైన రాష్ట్రమని, తెలంగాణలో పెట్టబడులు పెట్టడానికి ముందుకురావాలని పలు బహుళజాతి కంపెనీలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయపు జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్ తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యి తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు సహకారం అందించడం వంటి అంశాలపై వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టబడులు పెట్టేలా చొరవ చూపాలని కోరారు.

publive-image

ఆరాంకో సంస్థ ప్రతినిధులతో శ్రీధర్ బాబు చర్చలు

ఈ భేటీ అనంతరం రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయస్థాయిలో దిగ్గజ సంస్థగా పేరుపొందిన అరాంకో ఆరాంకో సంస్థ ప్రతినిధులతో శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై మాట్లాడిన అనంతరం ఆ సంస్థ పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల మద్దితిచ్చేందుకు హామీ ఇచ్చారు.

publive-image

ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవోతో చర్చలు 

అలాగే .. విద్యుత్తు, హాస్పెటాలిటీ, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కే తో సమావేశమయ్యి పెట్టుబడులపై మాట్లాడారు.
ఈ సమావేశాల అనంతరం ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా ఛాంబర్స్ తో, ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పోరేషన్ ప్రతినిధులతో, బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.

publive-image

సానుకూలంగా స్పందించిన అనేక సంస్థలు

రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి గానూ ఉన్న అనువైన పరిస్థితుల గురించి మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాల వంటి విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబర్చాయి. అనేక సంస్థలు సానుకూలంగా స్పందించాయి.మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.

.ALSO READ:ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..!

#telangan #minister-sridhar-babu #jeddah #saudi-arabia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe