Minister Seethakka: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. తాజాగా స్మితా సబర్వాల్‌పై (IAS Smita Sabharwal) మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. స్మితా సబర్వాల్‌పై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అంగవైకల్యం కంటే బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. IAS అధికారులు బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. అంగ వైకల్యంతో అద్భుతాలు చేసిన వారు లేరా? అని ప్రశ్నించారు. అనాదిగా కొన్ని వర్గాలు మమ్మల్ని కించపరుస్తున్నాయని అన్నారు.
IAS స్మితా సబర్వాల్ ట్వీట్ అగ్గి రాజేసింది. సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా రిజర్వేషన్ (Disability Quota Reservation) అవసరమా అంటూ ప్రశ్నించారు. నాతో ఎగ్జామ్ రాసి, నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోమంటూ స్మితా సబర్వాల్‌కు సివిల్స్ మెంటర్ బాలలత సవాల్ విసిరారు. బాలలతకు కౌంటరిస్తూ మరో ట్వీట్ చేసింది స్మితా సబర్వాల్. మీ దివ్యాంగ రిజర్వేషన్‌ను ప్రజల కోసం వాడారా? లేక కోచింగ్ సంస్థలు నడుపుకున్నారా అంటూ స్మితా ప్రశ్నలు కురిపించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దివ్యాంగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్