Minister Seethakka: ఏపీలో పొత్తులపై మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు మంత్రి సీతక్క. అందుకే రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం సాధించాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికే మోడీ సర్కార్ అక్రమ కేసుల్లో సీఎంలను అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Minister Seethakka: ఏపీలో పొత్తులపై మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

Minister Seethakka: రానున్న లోక్ సభ ఎన్నికలపై ఆర్టీవీతో కీలక విషయాలు పంచుకున్నారు మంత్రి సీతక్క. తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే రాష్ట్రాలోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని విజయం సాధించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు.

ALSO READ: పవన్‌పై పోటీకి ట్రాన్స్‌జెండర్

బీజేపీ పాలనలో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సామాన్య ప్రజల కోసం చేసిన మంచి పని ఎమన్నా ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో పెరిగిన ధారాలుతో సామాన్యుడు రగిలిపోయాడని ఫైర్ అయ్యారు. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు ఆరు శాతం వడ్డీకే రుణాలు ఇచ్చారని.. కానీ రైతులకు మాత్రం 24 శాతం వడ్డీతో అప్పులు ఇచ్చారని ఫైర్ అయ్యారు.

బీజేపీ అంటేనే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ.. రైతులకు చేసింది ఏంటని? నిలదీశారు. లోక్ సభ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీతక్క. సీతక్క చెప్పిన గెలుపు సీక్రెట్స్ తెలుసుకోవాలంటే కింది వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు