మంత్రి సీతక్క వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులు రూ.1200 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించినట్లు సీతక్క ఆరోపణలు చేశారు. సర్పంచులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించి ఉంటే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఉండేది కాదన్నారు.
Also read: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
ఇప్పుడు కుదరదు
అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాలు, పెన్షన్లు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొ్న్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం నిధులను వెచ్చిస్తోందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మంత్రి చెప్పారు.
రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా
గత పాలకులు పదేళ్లలో సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపినట్లు విమర్శలు చేశారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజాదారణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తప్పుడు మాటలను ప్రజలు ఇక నమ్మని పరిస్థితి వచ్చిందని.. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారంటూ పేర్కొన్నారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పట్టిందెవరంటూ ప్రశ్నించారు. ఇక రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గత ప్రభుత్వం వివక్ష చూపిందని సీతక్క విమర్శించారు. తొందర్లోనే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సమావేశమవుతారని స్పష్టం చేశారు.
Also Read: పోలీసుల అదుపులో కుర్చీతాత.. ఇంతకీ ఈయన ఎవరు..?