Minister Seediri Appalaraju: పిచ్చెక్కి మాట్లాడుతుండు... లోకేష్‌పై మంత్రి సీదిరి ఫైర్ చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా? అని నిలదీశారు. By V.J Reddy 11 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Minister Seediri Appalaraju: సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు ఎన్ని టీచర్ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్ ఉందా? అని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ALSO READ: పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ! లోకేష్ పిచ్చెక్కి... అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని లెక్కలు చెప్పారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ లక్షా 43 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన గురించి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయ్యలేదని విమర్శించారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. ఇలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా? అని ప్రశ్నించారు. లోకేష్ చేసేవన్నీ దొంగ పాదయాత్రలని చురకలు అంటించారు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా? అని నిలదీశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ALSO READ: షర్మిలకు ప్రాణహాని.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు DO WATCH: #lokesh #chandrababu #cm-jagan #ap-latest-news #minister-seediri-appalaraju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి