తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడం కలకలం రేపుతోంది. తుపాకీతో తనను తానే కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్‌లో ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన కొడుకుతో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే ఫాజిల్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులా? కుటుంబ కలహాలా? లేక ఇంకేమైన జరిగింటుందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Also read: తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!!