Minister Roja cried: ఏపీ మంత్రి రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Bandaru satyanarayana) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. బండారు వ్యాఖ్యలను ఏపీ మహిళా కమిషన్ సైతం సీరియస్‌గా తీసుకోవడం.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించడం తెలిసిందే. తాజాగా బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్రయ పోరాటంలో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆర్కే రోజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండారు కామెంట్స్‌పై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా మాటలు చూస్తే బండారు చేసిన వ్యాఖ్యలు ఆమెను ఎంతగానో బాధపెట్టినట్టు తెలుస్తోంది. చాలా భావోద్వేగానికి లోనైన రోజా బండారు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.
పెంపకం ఎలా ఉందో అర్థమవుతుంది:
బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు రోజా. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని.. వారిని అవమానించడం చాలా తప్పని మండిపడ్డారు. తనపైనే కాదు అని.. మహిళ స్థాయిని చూసి కూడా కాదు అని.. ప్రతి మహిళకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు రోజా. మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన ఓ వ్యక్తి మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు దారణమన్నారు రోజా. ఆయన మాటలకు.. ఇంట్లోని ఆడవాళ్లు కూడా సిగ్గుతో తలదించుకుంటారని విరుచుకుపడ్డారు.
అసలేం జరిగిందంటే?
మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరున్న వీడియోలు బయటపెడితే రోజా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని, ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఇక రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలు టీడీపీ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ‘బ్లూఫిల్మ్స్’, ‘గెస్ట్ హౌస్’, ‘బజారు బతుకమ్మ’ వంటి బండారు చేసిన అనుచిత ఆరోపణలు ఇప్పుడు టీడీపీ నేతలను ఇరకాటంలో పడేశాయి. ఓ మహిళా మంత్రితో టీడీపీ నేతలు మాట్లాడే తీరు ఇదేనా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
ALSO READ: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్ క్యాడర్‌లో టెన్షన్!