Khammam Politics: దమ్ముంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఆ పని చేయండి: తుమ్మల, పొంగులేటిపై పువ్వాడ ఫైర్ ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు. By Vijaya Nimma 16 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి గత పది సంవత్సరాల క్రితం టీడీపీ, కాంగ్రేస్ హయాంలో అభివృద్ది శూన్యమని పువ్వాడ ధ్వజమెత్తారు. మరి వాళ్ళకే సరైన గ్యారెంటీ లేదు.. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా..? అంటూ తుమ్ముల, పొంగులేటిపై పరోక్షంగా విమర్శించారు. ఒక అతను వస్తాడు.. నా చేతుల్లో ఓడిపోయి, ఐదు సంవత్సరాలకి ఒక పార్టీ మారుతారని ఆరోపించారు. కేసీఆర్ అనేక పదవులు కట్టబెట్టినా.. ఇప్పుడూ పార్టీని, కేసీఆర్‌ని మోసం చేసారని మండిపడ్డారు. నేను ఖమ్మంలో లేనప్పుడు ఓ ముగ్గురిని లాక్కుని అదేదో ఘనత సాధించినట్టు సోషల్ మీడియాల్లో చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే పని నేను ఖమ్మంలో ఉన్నప్పుడు చేస్తే బాగుండేదన్నారు. అప్పుడు అసలు సినిమా ఏంటో చూపించేవాడినని మండిపడ్డారు. గుంట నక్కలా వ్యవహరించే వారికి తగిన బుద్ది చెబుతాం అంటూ హెచ్చరించారు. పాలేరు కాకపోతే ఇక్కడ.. ఇక్కడ కాకపోతే పాలేరు.. వాళ్లు ఖమ్మంను రెండవ ఆప్షన్ చేసుకున్నారని విమర్శించారు. నాకు వన్ ఓన్లీ ఆప్షన్ ఖమ్మం మాత్రమే ఉందని పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను మోసం చేశావ్.. చంద్రబాబును మోసం చేశావ్.. కేసీఆర్‌ను మోసం చేశావ్.. ఇపుడు కాంగ్రెస్‌ను ఖతం చేస్తావ్ అంటూ విమర్శలు చేశారు. పోయిన ఎన్నికల్లో ఇద్దరు కత్తులు దూసుకున్నారు.. ఇప్పుడు కలిసి తిరుగుతున్నారని తుమ్మల, పొంగులేటిపై మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ఏపీలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో ఏం చేశాడంటే…? #telangana-election-2023 #puvvada-ajay #spiritual-congregation #mustafanagar #khammam-city మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి