Telangana: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి !

యూరో ఎగ్జిమ్ బ్యాంకు దొంగ గ్యారెంటీలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో RDSS కాంట్రాక్ట్‌లో భాగంగా ఆయన ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

New Update
Telangana: ప్రభుత్వాన్ని మోసం చేసిన మంత్రి పొంగులేటి !

యూరో ఎగ్జిమ్ బ్యాంకుపై RTV బయటపెట్టిన కథనాలు దేశంలో సంచలనం రేపుతున్నాయి. దీనికి సంబంధించి దొంగ గ్యారెంటీలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగేకొద్ది డొంక కదులుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో RDSS కాంట్రాక్ట్‌లో భాగంగా ఆయన ఫేక్ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2023లో దీనికి సంబంధించి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా ఇచ్చిన గ్యారెంటీ గడువు ముగిసిందని రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు SPDCL లేఖ రాసింది.

Also Read: హైడ్రా చర్యలు వేగవంతం.. పేద, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి ?

దీంతో మరోసారి ఏదైనా జాతీయ బ్యాంకు ద్వారా గ్యారెంటీ ఇవ్వాలని SPDCL కోరింది. అయితే ఇప్పటికే యూరో ఎగ్జిమ్‌ బ్యాంకుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దేశంతో సంబంధం లేని బ్యాంకుతో పొంగులేటికి చెందిన సంస్థ గ్యారెంటీ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే కేవలం రూ.8 కోట్ల విలువ చేసే బ్యాంకు ఏకంగా వంద కోట్ల వరకు గ్యారెంటీలు ఇవ్వడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న పొంగులేటి ప్రభుత్వాన్ని మోసం చేసారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు యూరో ఎగ్జిమ్‌ బ్యాంకు ద్వారా మంత్రి పొంగులేటితో పాటు మేఘా కంపెనీకి సంబంధించిన కంపెనీలు కూడా గ్యారెంటీలు తీసుకుందని ఇప్పటికే RTV బయటపెట్టింది. ఇప్పుడు SPDCL లేఖతో మారోసారి వెలుగులోకి వచ్చిన పొంగులేటి ఫేక్ గ్యారెంటీ అంశం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ సథరన్‌ పవర్ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందంలో భాగంగా పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ ఫేక్‌ విదేశీ బ్యాంక్ గ్యారెంటీని వినియోగించింది. వాస్తవానికి ఇండియాలో గుర్తింపు పొందిన బ్యాంకు ద్వారా బ్యాంకు గ్యారెంటీని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే విదేశీ బ్యాంక్ ద్వారా ఈ గ్యారెంటీని ఇప్పించడం సంచలనంగా మారింది. ఈ ఫేక్ బ్యాంకు ద్వారా పొంగులేటి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో చేపట్టిన అనేక ప్రాజెక్టుల కోసం ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సమర్పించింది.

APSPDCL రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు ఓ లేఖ రాసింది. అందులో నేషనల్ బ్యాంక్ లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారానే గ్యారెంటీ సమర్పించాలని స్పష్టంగా చెప్పింది. కానీ పొంగులేటి ఈ నిబంధనను ఉల్లంఘించి, విదేశీ బ్యాంకు ద్వారా గ్యారెంటీని ఇచ్చారు. అసలు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు ఇండియాతో ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు యూరో ఎగ్జిమ్‌ బ్యాంకుకు RBI గుర్తింపు కూడా లేదు. ఇదొక్కటే కాదు.. పొంగులేటికి చెందిన సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టులకు టెండర్లు పొందడం కోసం రూ.80 కోట్ల విలువైన ఫేక్ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించింది. అంటే ఈ ప్రాజెక్టుల విలువ చూసుకుంటే దాదాపు రూ. 800 కోట్లు.

Also Read: అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన

మరీ ఇప్పుడు పొంగులేటి తాను చేసిన తప్పును అంగీకరిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఫేక్ బ్యాంకు గ్యారెంటీ ద్వారా పొంగులేటి డబ్బులు సంపాదించారా ?, నిజాలు బయటకు వచ్చిన తర్వాత పొంగులేటిపై చర్యలు తీసుకుంటారా ?, ఫేక్ బ్యాంకు గ్యారెంటీలను ఉపయోగించి ప్రభుత్వ సంస్థలను మోసం చేసిన పొంగులేటి కంపెనీని రద్దు చేస్తారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం రూ.8 కోట్ల విలువ ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంకు.. వందల కోట్ల విలువైన గ్యారెంటీలు ఇవ్వడంపై గతంలోనే RTV వివరించింది. మేఘా లాంటి బడా కాంట్రాక్టు సంస్థలు సైతం ఫేక్ బ్యాంకు గ్యారెంటీల ద్వారా దేశ ప్రజల సొమ్మును ఎలా నొక్కేశాయో బయటపెట్టింది. Rtv వరుసగా ప్రసారం చేసిన కథనాలతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఇప్పటికే RBI సీబీఐకి లేఖ రాసింది. అంతే కాదు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సైతం రెండు సార్లు RBIకి యూరో ఎగ్జిమ్ బ్యాంకు మోసాలపై లేఖ రాశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి ఈ ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా లబ్ధి పొందారు. ఇలాంటి మోసాలకు పాల్పడ్డ వారిపై మరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు