Telangana: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి

తెలంగాణలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ (LRS) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.

New Update
Telangana: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ (LRS) ప్రక్రియకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. శనివారం భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రూల్స్‌కు కట్టుబడి ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్లలను రెగ్యులరైజ్ చేయాని సూచించారు. అలాగే ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు తీసుకుంది.

Also Read: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు!

Advertisment
తాజా కథనాలు