TG JOBS: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు! టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 6వేల పోస్టులతో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. దీనికంటే ముందు 2025 ఏప్రిల్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. ఇది నిరుద్యోగులు మరో సదవకాశంగా భావించొచ్చు. By srinivas 03 Aug 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు కొనసాగుతుండగానే మరో టెట్, డీస్సీకి నోటిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన స్పష్టమైన వివరాలను వెల్లడించారు. 💥Telangana Job Calendar 2024-25💥 1. Group I Mains: Oct 21-27, 2024 (Notified: Feb 2024) 2. Group III Services: Nov 17-18, 2024 (Notified: Dec 2022) 3. Lab Tech/Nurse/Pharmacist: Nov 2024 (Notified: Sep 2024) 4. Group II Services: Dec 2024 (Notified: Dec 2022) 5. Engg Posts… pic.twitter.com/jC7BTi4Bt6 — Bolgam Srinivas (@BolgamReports) August 2, 2024 ఫిబ్రవరి-2025లో నోటిఫికేషన్.. ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న లోసుగులు క్లియర్ చేసి 11,602 వేల పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే పరీక్షలకు ముందు నిరుద్యోగుల నుంచి మెగా డీఎస్సీ డిమాండ్ వ్యక్తం కావడంతో మరో 6 వేలతో వచ్చే ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. టెట్ నోటిఫికేషన్ నవంబర్ లో విడుదల చేసి పరీక్షను జనవరిలో నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి-2025లో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్-2025 న పరీక్షను నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. దీంతో మరోసారి టీచర్ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. టెట్ క్వాలీఫై కాని వారు కూడా మరోసారి టెట్ రాసుకునే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత! పాఠశాలలపై మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,062 టీచర్ పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలింది. ఈ ఐదువేలతోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీచేస్తూనే ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. #telangana #february-2025 #dsc-notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి