Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం
దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 160 దేవాలయాలను రూ.113 కోట్లతో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.