Mallareddy: భూకబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

మాజీ మంత్రి మల్లారెడ్డి 47 ఎకరాలు గిరిజనుల భూములు కబ్జాచేశారని ఆరోపణలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు. తాను భూకబ్జా చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవంటూ కొట్టిపారేశారు.గిరిజనుల భూములకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Mallareddy: భూకబ్జా కేసుపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
New Update

మాజీ మంత్రి మల్లారెడ్డి గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాల భూమి కబ్జా చేశారనే ఆరోపణలతో నిన్న (బుధవారం) ఆయనపై కేసు నమోదు కావడం దుమారం రేపింది. సికింద్రాబాద్‌ సమీపంలోని మూడు చింతలపల్లి కేశవరం భూకబ్జా ఆరోపణల విషయంలో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు కావడం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదంపై తాజాగా మల్లారెడ్డి స్పందించారు. అసలు భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదంటూ చెప్పారు. తాను భూకబ్జ చేసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవంటూ కొట్టిపారేశారు. గిరిజనుల భూములకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కొందరు మధ్యవర్తులు కొనుగోలు, అమ్మాకాల్లో ఉన్నారని.. వారే గిరిజనులు భూమిని కబ్జా చేసి ఉంటారన్నారు. మరోవిషయం ఏంటంటే ఈ అంశంలో ప్రభుత్వం తనపై చేస్తున్న కక్ష సాధింపు చర్య అని భావించట్లేదని తెలిపారు.

Also read: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే!

#telugu-news #malla-reddy #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe