Telangana: ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్‌ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు.

Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్..
New Update

Minister KTR Comments on NTR: ఎంతమంది నాయకులు వచ్చినా నందమూరి తారక రామారావుకు(NTR) సాటిలేరని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఎన్టీఆర్‌ ఆదర్శమని వ్యాఖ్యానించారు కేటీఆర్(KTR). ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారని అన్నారు. ఖమ్మం జిల్లా నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద రూ.1.37 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్‌, విగ్రహాన్ని మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్. ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ లాగానే ఉంటారని మనమంతా అనుకుంటాం అన్నారు. తనకు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే సమయంలో ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టలేకపోయారని, ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా గురువు చేయలేని పనిని శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేయబోతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తారకరామారావు అనే పేరులోనే ఏదో శక్తి ఉందన్నారు. అయితే, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం.. దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.

సత్తుపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్..

Also Read:

Nara Bhuvaneshwari: భువనేశ్వరి నిరాహార దీక్ష.. బాలకృష్ణ సంచలన ప్రకటన

Ktr: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ పన్ను.. కేటీఆర్ సంచలన ట్వీట్

#telangana #khammam #minister-ktr #it-minister-ktr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe