Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ

అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. డెంగీ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని.. తన పరిస్థితిని అర్థం చేసుకుటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Konda Surekha : వారం రోజులుగా డెంగీతో బాధపడుతున్నా.. అర్థం చేసుకోండి: కొండా సురేఖ
New Update

Dengue : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనే ఆమె జ్వరం బారిన పడ్డారు. దీంతో తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులగా మంత్రికి జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయగా డాక్టర్లు.. ఆమెకు డెంగీ పాజిటివ్(Dengue Positive) గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌(Hyderabad) లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు.

Also Read :  ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన..

తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో గత వారం రోజులుగా డెంగీ ఫీవర్‌తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నానని.. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read : ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..

#telugu-news #telangana-news #dengue-fever-remedies #konda-surekha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe