Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి By B Aravind 06 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Komatireddy Venkat Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీకే జీతాలు ఇస్తున్నామని అన్నారు. నిరుద్యోగుల కోసం గ్రూప్-1 (TSPSC Group 1) , డీఎస్సీ (TS DSC) నోటిఫికేషన్లు ఇచ్చామని.. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణంపై విచారణ చేయిస్తామని చెప్పారు. Also Read: సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత ఎమ్మెల్యేలు! బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు అలాగే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం విషయంలో కూడా మార్పులు ఉంటున్నాయని అన్నారు. ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. తాజాగా భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రతిష్ఠ దిగజారిపోయిందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఖాళీ అయ్యిందని.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. రాహుల్ కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13-14 ఎంపీ స్థానాల్లో (MP Seats) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేతలే మమ్మల్ని అభినందిస్తున్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మరింతగా శ్రమించాలని పిలుపునిచ్చారు. రాహుల్‌గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని.. తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయన్ని ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. Also Read: బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ.. కాంగ్రెస్‌లోకి కోనేరు కోనప్ప #telangana #national-news #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి