Komatireddy Venkat Reddy Warned Alleti Maheshwar: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 'షిండే' అంటూ ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ' మహేశ్వర్ రెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరం. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరుతా మంత్రి పదవి ఇవ్వమని గతంలో మహేశ్వర్ రెడ్డి అడిగాడు. గాలిమాటల మహేశ్వర్ రెడ్డి.. రాజకీయాల్లో జెండాలు మార్చి నాపై విమర్శలు చేస్తున్నాడు. అతడు మతిస్థిమితం కోల్పోయాడు.
Also read: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు..
వాళ్లని తీసుకొని రా ప్రమాణం చెద్దాం
మహేశ్వర్ రెడ్డి.. నేను నా సొంత ఇమెజ్‌తో ఎమ్మెల్యేగా గెలిచానని.. బీజేపీ (BJP) నుంచి నాకొచ్చిన లాభం ఏమి లేదని చెప్పాడు. కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యేవాడినంటూ దిగులుపడ్డాడు. అలాంటి వ్యక్తి నన్ను షిండే అన్నాడంటే నాకే విచిత్రంగా ఉంది. నేను షిండేను అవునో కాదో భగవంతునికి ఎరుక. మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి, ఈటల రాజేంధర్‌కు వెనుపోటు పొడిచే నయా గాలి జనార్ధన్ రెడ్డి. అవకాశం ఇస్తే.. రాత్రికి రాత్రే పార్టీ మారుతానని మహేశ్వర్ రెడ్డి బతిమాలాడు. మాకే మెజార్టీ ఉంది.. అవసరం లేదని చెప్పాను. పార్టీలో చేర్చుకోనందుకు మనసులో పెట్టుకోని ఏదేదో మాట్లాడుతున్నాడు. అమిత్ షా, గడ్కరీలను తీసుకురా.. భాగ్యలక్మీ ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం అంటూ ఛాలెంజ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. కాంగ్రెస్‌లో పుట్టా.. కాంగ్రెస్ జెండాతోనే పోతానని' కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారు
ఇదిలాఉండగా ఏలేటీ మహేశ్వర్ రెడ్డి.. మా పార్టీ హైకమాండ్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. నేను కోమటి రెడ్డిని అడుగుతున్నా.. మీరు అమిత్‌షా, గడ్కరీని కలిసి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పలేదా అంటూ ప్రశ్నించారు. బిడ్డా కోమటిరెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు మాతో ఐదుగురు మంత్రులు టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఐదుగురు మంత్రులు ఎవరనే విషయాన్ని మహేశ్వర్ రెడ్డి వెల్లడించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేగడంతో తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: కేసీఆర్, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..