Minister Komati Reddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) స్వల్ప అస్వస్థకు గురయ్యారు. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో విరామం లేకుండా ప్రచారంలో పాల్గొనడం...ఎక్కువగా ప్రసంగించాల్సి రావడంతో కోమటిరెడ్డి త్రోట్ ఇన్పెక్షన్కు గురయ్యారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి తీవ్రత పెరగడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే చికిత్స కోసం ఆయన యశోదా ఆసుపత్రిలో చేరారు. కోమటిరెడ్డికి టెస్టులు చేసిన వైద్యులు ఈ ఇన్ఫెక్షన్ తో పెద్ద సమస్యేమీ లేదని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Also Read: టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..