Minister Harish Rao: సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లుంది.. ప్రధాని మోదీపై విరుచుకుపడిన హరీష్ రావు..

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల తీరుపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాకు రైలు కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మంత్రి. సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరం అని అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా.. సహా అనేక కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు.

New Update
Minister Harish Rao: సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లుంది.. ప్రధాని మోదీపై విరుచుకుపడిన హరీష్ రావు..

Minister Harish Rao: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల తీరుపై తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాకు రైలు కేటాయింపు విషయంలో బీజేపీ(BJP) నేతలు చేస్తున్న కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు మంత్రి. సిద్దిపేట జిల్లాకు రైలు రావడం గొప్ప వరం అని అన్నారు. నీళ్లు, నిధులు, జిల్లా.. సహా అనేక కలల్ని నిజం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు. గత ప్రభుత్వాలు సిద్దిపేటను అస్సలు పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సిద్దిపేటకు రైలు తీసుకువస్తామని అబద్దాలు చెప్పారే తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. 2006 రైల్వే లైన్ మంజూరు అయ్యిందన్నారు. ఈ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రాష్ట్ర వాటా కూడా చెల్లించిందని తెలిపారు మంత్రి హరీష్ రావు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు రైల్వే లైన్‌ను స్వయంగా రూపకల్పన చేశారని తెలిపారు. అయితే, రాష్ట్రంలో మంత్రులు మారారు కానీ, సిద్దిపేటకు రైల్వే లైన్ మాత్రం రాలేదన్నారు. తెలంగాణ ప్రజల అదృష్టం, తెలంగాణ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సిద్దిపేట చిరకాల కోరిక కూడా నెరవేరిందని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు

ఆనాడు కేంద్ర మంత్రి ఉన్న కేసీఆర్.. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటా చెల్లించారని తెలిపారు మంత్రి. నాటి ప్రభుత్వాలు సిద్దిపేట, మెదక్, కరీంనగర్ జిల్లాలపై కక్ష కట్టాయని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే నేడు సిద్దిపేటకు రైల్వే లైన్ వచ్చిందని ఉద్ఘాటించారు మంత్రి హరీష్ రావు. బీజేపీ వారు తమ వల్లే రైలు వచ్చిందని చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 33 శాతం వాటా కడితే కనీసం ముఖ్యమంత్రి ఫోటో కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం.. 2,508 ఎకరాల భూమిని సేకరించి, రూ. 310 కోట్లు చెల్లించిందన్నారు. వీరి వాలకం చూస్తుంటే సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లుగా ఉందన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడింది తాము.. డబ్బులు ఇచ్చింది తాము అని, ఈ విజయం తెలంగాణ ప్రజలది అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. నాడు కాంగ్రెస్ మోసం చేస్తే.. నేడు బీజేపీ అబద్ధాలతో కాలం వెల్లదీస్తోందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. అసలు కేసీఆర్ లేకపోతే.. ఈ రైల్వే లేన్ ఇప్పటికీ రాకపోతుండేనని అన్నారు.

Also Read:

సీఈసీ బృందంతో పొలిటికల్ లీడర్స్ భేటీ.. వారం పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్!

Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా?

Advertisment
తాజా కథనాలు