Harish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు
New Update

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 70 సంవత్సరాలపైగా వయస్సు వున్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఆయన వయస్సుకైనా విలువ ఇచ్చి జైల్లో కాకుండా చంద్రబాబును ఇంట్లో ఉంచి విచారించాల్సిందని హరీష్‌ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా చంద్రబాబు అరెస్ట్‌పై వివిధ పార్టీలకు చెందిన నేతలు స్పందిస్తున్నారు, చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని కొందరు అంటే, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా అరెస్ట్‌ చేశారని మరికొందరు తెలిపారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి డప్పులతో, గరిటెలతో చప్పుళ్లు చేశారు.

అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై జైల్లోనే దీక్ష చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అదే రోజు నారా భువనేశ్వరి సైతం చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా దీక్ష చేయనున్నట్లు తెలిపారు. కాగా నారా భువనేశ్వరి ఎక్కడ దీక్ష చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

#chandrababu #arrested #chief-minister #minister-harish-rao #sad #15-years
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe