Minister Botsa: మున్సిపల్‌ కార్మికులు విధుల్లో చేరాలి.. మంత్రి బొత్స

మున్సిపల్‌ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని అన్నారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే వారి డిమాండ్లకు సంభందించిన నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

New Update
Botsa Satyanarayana: వెనుకంజ‌లో బొత్స సత్యనారాయణ.!

Minister Botsa Satyanarayana: మున్సిపల్‌ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హెల్త్‌ అలవెన్స్‌ (Health Allowance) రూ. 6 వేలు వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. హెల్త్‌ అలవెన్స్‌ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని చెప్పింనట్లు తెలిపారు. పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇస్తామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే పరిహారం పెంచినట్లు తెలిపారు.

ALSO READ: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

విధుల్లో చేరండి..

ప్రమాద పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచినట్లు మంత్రి బొత్స(Botsa Satyanarayana) తెలిపారు. మరికొన్ని డిమాండ్లకూ మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని అన్నారు. మున్సిపల్‌ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితే అమలు చేస్తాం అని అన్నారు. సమ్మె విరమిస్తే నోటిఫికేషన్‌ ఇస్తాం అని అన్నారు.

వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు..

రిటైర్ అయిన తరువాత వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు ఇస్తాం అని కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చామని మంత్రి బొత్స తెలిపారు. కనీస సర్వీస్ 10 ఏళ్ళు ఉండాలని అన్నారు. పదేళ్ళు పైన సర్వీస్ ఉన్న వారికి ఏడాదికి రెండు వేలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండేళ్లలోనే జీతాలు ఎలా పెంచుతారని ఆయన కార్మిక సంఘాల నేతలను ప్రశ్నించారు. సమ్మె విరమించాలని సంఘాలను కోరారు. ప్రభుత్వం ఐదేళ్ళ కాలానికి ఉంటుంది.. ఐదేళ్ళకు ఒకసారి జీతాలు పెంచుతారని మంత్రి తెలిపారు. ప్రతి ఏటా జీతాలు పెంచుతారా.. మరోసారి అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచుతామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. పండుగల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి వారికి సూచించారు. సమ్మె విరమిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ALSO READ: మంచు లక్ష్మీకి అదిరిపోయే సవాల్ విసిరిన మెగా హీరో.. షాక్ లో మోహన్ బాబు ఫ్యామిలీ

Advertisment
తాజా కథనాలు