Batti Vikramarka: పలు శాఖలకు నిధులు విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క..

ఆర్థిక, విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క పలు శాఖలకు నిధులను మంజూరు చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.298 కోట్లు , విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, మేడారం జాతర కోసం రూ.75 కోట్లు విడుదల చేశారు.

Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
New Update

తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక శాఖ, విద్యుత్‌శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత భట్టి విక్రమార్క పలు శాఖలకు ప్రభుత్వ నిధులను మంజూరు చేశారు. అలాగే వాటికి సంబంధించిన దస్త్రాలపై కూడా ఆయన సంతకాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సబ్సీడీ కింద.. భట్టి రూ.374 కోట్ల నిధులు విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు , విద్యుత్ సబ్సిడీ కోసం రూ.996 కోట్లు విడుదల చేశారు. అలాగే మేడారం జాతర ఏర్పాట్లకు కూడా రూ.75 కోట్ల నిధులను విడుదల చేశారు.

Also read: లేదు నేనెక్కడికీ వెళ్ళడం లేదు..ఆ వార్తలన్నీ అవాస్తవం-స్మితా సభర్వాల్

ఇదిలా ఉండగా.. అంతకుముందు మహాత్మ జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో భట్టి విక్రమార్క దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అయితే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రజాభవన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది.

Also read: షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..

#telugu-news #batti-vikramarka #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe