Ambati Rambabu about AP Capital: గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సీటు బీసీకి కేటాయించడం సీఎం జగన్ (CM Jagan) తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏడు నియోజకవర్గల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను (YCP Candidates List) ప్రకటిస్తున్నామన్నారు. కానీ టీడీపీ, జనసేన (TDP-Janasena) మాత్రం వారి పొత్తులోనే ఇప్పటివరకు క్లారిటీ లేదని విమర్శలు గుప్పించారు.
Also Read: కాకినాడలో క్షుద్రపూజలు కలకలం.. భయం గుప్పిట్లో గ్రామ ప్రజలు..!
జనసేన ఎవరితో పొత్తులో ఉంది.. బీజేపీతోనా? టీడీపీతోనా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే శ్రీకృషదేవరాయులు ఎందుకు పార్టీ వీడారు? సీటు బీసీలకు కేటాయిస్తే పార్టీ వీడి వెళ్లిపోతారా? బీసీలు అంటే అంత కడుపు మంట ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏం న్యాయం చేస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి రేసులో స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారని.. ఒకరు జగన్.. ఇంకొకరు చంద్రబాబు అని అన్నారు. పవన్, షర్మిల (Sharmila), లోకేష్, బీజేపీలు అందరూ స్క్రీన్ ఔట్ అని కౌంటర్లు వేశారు. పైసా లంచం లేకుండా 2 లక్షల, 60 కోట్లతో ప్రజలకు సంక్షేమ పధకాలు అందించామని.. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్ అని అన్నారు.
Also Read: జగన్ సైకో..ఆయన వైఖరి కక్షసాధింపే: మాజీ మంత్రి నారాయణ
అసంతృప్తి ఉన్న వారందరిని కలుపుకుని పోతామని.. కుదరకపోతే ఎంపీ లావులా వెళ్ళిపోతారని అన్నారు. దాని వల్ల పార్టీకి నష్టం లేదని.. వీ డోంట్ కేర్ అని ఖరకండిగా చెప్పేశారు. అభ్యర్థులలో అన్ని మార్పులు అయిపోయాయని.. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ఉన్న నాయకులు ఫిక్స్ అని వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మా మ్యానిఫెస్టో డిస్ ప్లే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీకి రాజధాని (AP Capital) ఏదంటే ప్రస్తుతానికి అమరావతి (Amaravati) అని చెబుతానన్నారు. అయితే మా నినాదం, విధానం మాత్రం మూడు రాజధానులేనన్నారు. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాము, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.