Breaking: ఏపీ మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్‌ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్‌ పై పడ్డాయి.

New Update

నాందేడ్‌ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ కి ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమల లోడుతో వెళ్తున్న లారీకి బలంగా తగిలాయి. దీంతో రెండు బస్తాలు మంత్రి కారు మీద పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ సడెన్ బ్రేక్‌ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తరువాత కారులో ఉన్న అంబటి మరో కారులో ఖమ్మం వెళ్లారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఈ ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో.. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై వైసీపీ నేతలు, అంబటి అభిమానులు ఆందోళన చెందారు. అంబటికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Also read: మెగా వెడ్డింగ్‌ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Advertisment
Advertisment
తాజా కథనాలు