Minister Ambati Rambabu: సీఎం జగన్ పై దాడికి నిరసనగా సత్తెనపల్లిలో నల్లజెండాలతో వైసీపీ పార్టీ నేతలు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై జరిగిన దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదరణతో అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని అన్నారు.
జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడని టీడీపీకి అడ్డా అని చంద్రబాబు అనుకుంటున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోలేకే ఈ దాడులు చేయిస్తున్నాడు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ను హతమార్చాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
విజయవాడలో తనకు అడ్డుగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగని చంద్రబాబు హత్య చేయించాడని అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు.
Ambati Rambabu: సీఎం జగన్‌ను చంపాలని చూస్తున్నారు.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి అంబటి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోలేక.. సీఎం జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.