Metro Services : ఇక నుంచి ఉదయం 5.30 గంటలకే మెట్రో సేవలు! ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలు కానున్నట్లు మెట్రో అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 30 Jul 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Metro Starts From 5:30Am : ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో (Hyderabad Metro) రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలు కానున్నట్లు మెట్రో అధికారులు వివరించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దానికి తోడు ప్రస్తుతం ఉన్న మెట్రో సమయాలను మరింత పొడిగించాలని నగర వాసుల నుంచి విఙప్తులు రావడంతో అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం ఐటీ ఉద్యోగులు (IT Employees) మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో ప్రయోగాత్మకంగా శుక్రవారం ఉదయం 5.30 నుంచే మెట్రో రైలును నడిపినట్లు..ఆ సమయంలో కూడా ప్రయాణికులు మెట్రోలో వెళ్లేందుకు ఆసక్తి చూపడంతో..ఇక నుంచి మెట్రో సేవలను (Metro Services) ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మెట్రో రైళ్లు నగర వాసులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా టైమ్ టేబు ల్స్‌ను మారుస్తున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండుకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. మూడు కారిడార్‌లలోని టర్మినల్ మెట్రో స్టేషన్‌ల నుంచి మెట్రో రైళ్లు ఉదయం 5.30 నుంచే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. Also read: ఒలింపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. క్వార్టర్స్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ! #it-employees #hyderabad-metro #hyderabad-metro-services మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి